మహారాష్ట్రలో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఓ భారీ రాయిని ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. పడవలో ప్రయాణిస్తున్న 88 మంది సురక్షితంగా బయటపడ్డారు.
రాయ్‌గఢ్ జిల్లా మాండ్వా తీరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

"ఓ పెద్ద రాయిని ఢీకొన్న తర్వాత పడవలోకి నీరు చేరింది. దీంతో పడవ మునిగింది. వెంటనే తీర ప్రాంత పోలీసులకు, ఇతర సంస్థలకు సమాచారం అందించాం. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు."-అధికారి
పడవలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు అధికారులు. వేరే పడవలో తీరానికి చేర్చినట్లు చెప్పారు.