తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: నదిలో బోటు బోల్తా- 20 మంది గల్లంతు - bihar katiyar accident

బిహార్ మహానంద నదిలో ఓ పర్యటక బోటు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. 80 మంది పర్యటకులతో బంగాల్​ నుంచి బిహార్​కు వెళ్తున్న బోటు.. కటిహార్​ జిల్లా దగ్గర నది ప్రవాహం ఎక్కువవడం, సామర్థ్యానికి మించి పర్యటకులు ఉన్న కారణంగా బోల్తా పడింది. గల్లంతైన వారికోసం ముమ్మరంగా అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

నదిలో బోటు బోల్తా- ప్రమాద సమయంలో 60 మంది

By

Published : Oct 4, 2019, 8:49 AM IST

Updated : Oct 4, 2019, 11:36 AM IST

బిహార్​లోని కటిహార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహానంద నదిలో బంగాల్​ నుంచి బిహార్​కు వెళ్తున్న ఓ పర్యటక బోటు బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. కటియార్​ జిల్లా అబాద్​పుర్ లోని డమ్​డోలియా-బాజీద్​పుర్ మధ్య బంగాల్-బిహార్​ సరిహద్దులో జరిగిందీ ఘటన.

నదిలో బోటు బోల్తా

ప్రమాద సమయంలో పడవలో 80 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, బోటులో సామర్థ్యానికి మించి పర్యటకులు ఉన్న కారణంగానే పడవ అకస్మాత్తుగా బోల్తా పడిందని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.

"బోటు సామర్థ్యానికి మించి పర్యటకులను తీసుకెళ్లడం కారణంగానే ప్రమాదం జరిగింది. బోటు సామర్థ్యం 40 మంది మాత్రమే. కానీ దానికి రెట్టింపు సంఖ్యలో పర్యటకులను ఎక్కించారు. బోటులోని వారిలో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరి కొంతమందిని స్థానికులు కాపాడారు. కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నాం. "

-పోలీసు అధికారి.

ఇదీ చూడండి: ఈటీవీ-భారత్​ రిపోర్టర్​​పై విద్యార్థుల దాడి!

Last Updated : Oct 4, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details