తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం- 40 మందికి గాయాలు - dahej gujarat

ఓ రసాయన పరిశ్రమలోని బాయిలర్​ పేలి 40 మంది గాయపడిన ఘటన గుజరాత్​ భరూచ్​ జిల్లా దహేజ్​ ప్రాంతంలో జరిగింది. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Blast in a chemical company in dahej gujarat
గుజరాత్​లో అగ్ని ప్రమాదం.. 40 మందికి గాయాలు

By

Published : Jun 3, 2020, 4:26 PM IST

గుజరాత్​ భరూచ్ జిల్లా దహేజ్​లోని రసాయన పరిశ్రమలో బాయిలర్​ పేలి 40 మందికి గాయాలయ్యాయి.

"మధ్యాహ్నం సమయంలో వ్యవసాయ రసాయన కంపెనీకి చెందిన బాయిలర్​ పేలి 35 నుంచి 40 మంది కార్మికులకు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు." అని భరూచ్ జిల్లా పాలనాధికారి ఎండీ మోదీయా తెలిపారు.

గుజరాత్​లో అగ్ని ప్రమాదం

కర్మాగారం పరిసర ప్రాంతాల్లో ఉన్న లఖి, లువారా గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు మోదీయా. పరిశ్రమలో పెద్ద మొత్తంలో రసాయనాలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:జీర్ణక్రియ సమస్య 'షికంజి'తో మాయం

ABOUT THE AUTHOR

...view details