నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో రైతులు ఘాజీపుర్ సరిహద్దుకు తరలివస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ సహా.. రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున దిల్లీ సరిహద్దులో రైతులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకుంటున్నారు.
భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ట్రాక్టర్ ర్యాలీ తర్వాత కాస్త బలహీన పడినట్టు అనిపించినప్పటికీ నిరసనల్లో పాల్గొనేందుకు రైతులు భారీగా వచ్చిచేరుతున్నారు. వీరంతా దిల్లీ-మేరఠ్ ఎక్స్ప్రెస్ హైవేపై బస చేశారు. ముజఫర్నగర్లో శనివారం నిర్వహించిన 'రైతుల మహాపంచాయత్' అనంతరం కర్షకులు దీక్షాస్థలికి పోటెత్తుతున్నారు.
" రైతు ఉద్యమం బలంగానే ఉంది. ఇది రాజకీయ ఆందోళన కాదు. శాంతియుత నిరసనలకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. నిరసనలకు సంఘీభావంగా అనేక మంది రైతులు తరలివస్తున్నారు."
- పవన్ ఖత్నా, మీరట్ బీకేయూ నేత
వారు అవసరం లేదు..