తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ అసెంబ్లీ స్పీకర్​గా​ విజయ్​ సిన్హా - బిహార్​ వార్తలు

ఎన్డీఏ అభ్యర్థి విజయ్​ కుమార్​ సిన్హా బిహార్​ అసెంబ్లీ సభాపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీలో స్వల్ప వాగ్వాదం జరిగింది.

BJP's Vijay Sinha elected Speaker of Bihar assembly
బిహార్​ అసెంబ్లీ స్పీకర్​ ఎన్నిక

By

Published : Nov 25, 2020, 2:20 PM IST

బిహార్​ అసెంబ్లీ స్పీకర్​గా విజయ్​ కుమార్​ సిన్హా ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి అయిన సిన్హాకు 126 ఓట్లు రాగా.. మహాకూటమి తరఫున పోటీ చేసిన అవధ్​ బిహారీ చౌదరీ(ఆర్జేడీ)కి 114 ఓట్లు వచ్చాయి.

శాసన మండలి సభ్యుడైన సీఎం నితీశ్​ కుమార్​ సభకు హాజరు కావడాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్​ జితన్​ రాం మాంఝీ.. వాయిస్ ఓటుకు మొగ్గుచూపడం వల్ల వివాదం మరింత ముదిరింది. మాంఝీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రహస్య బ్యాలెట్​ ద్వారా ఓటింగ్​ నిర్వహించాలని డిమాండ్​ చేశాయి. అయితే.. హెడ్​కౌంట్​ ఆధారంగా ఓటింగ్​ ముగించారు​ ప్రొటెం స్పీకర్​​.

ఇదీ చదవండి:'భర్తీ చేయలేని యోధుణ్ని కోల్పోయాం'

ABOUT THE AUTHOR

...view details