తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహారీలకు ఉచిత టీకాపై భాజపా క్లారిటీ - భాజపా వాక్సిన్​ వాగ్దానం

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అందుబాటులోకి రాగానే.. బిహార్​ ప్రజలకు ఉచితంగా అందిస్తామని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనటం వివాదాస్పదమైంది. విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఈ అంశంపై స్పందించారు. బిహార్​లో భాజపా ఇచ్చిన హామీ.. చట్టబద్ధం, చారిత్రకమని స్పష్టంచేశారు.

BJP's vaccine promise
'చట్టబద్ధం-చారిత్రాత్మకం' బిహరీలో ఉచిత వ్యాక్సిన్ హమీపై కేంద్ర మంత్రి

By

Published : Oct 23, 2020, 12:50 PM IST

బిహార్​లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర​ ప్రజలందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్​ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది భాజపా. వ్యాక్సిన్​ను ఉచితంగా అందిస్తామంటూ భాజపా తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనటంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఓటు వేస్తేనే టీకా ఇస్తారా? అంటూ మండిపడ్డాయి. ఈ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.. విపక్షాల తీరును తప్పుబట్టారు. ఈ హామీలో ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:'బిహార్​ ప్రజలకు ఉచితంగా కొవిడ్​-19 వ్యాక్సిన్'​

ఈ హామీని చారిత్రక అడుగుగా చెప్పుకొచ్చిన ఆయన.. భాజపా విధానాలపై విమర్శలు చేసే నైతికత విపక్షాలకు లేదని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తే.. తప్పేంటని నిలదీశారు.

కొందరు దీనిని రాజకీయ కుట్రగా పేర్కొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజారోగ్యం మెరుగుపర్చడానికి, వారి ఆరోగ్యం సంరక్షణకు వాగ్దానాలు చేయకూడదా? ఈ ప్రకటన పూర్తిగా చట్టబద్ధమైనది. ఎన్నికలకు ముందు భారీ హామీలు గుప్పించి, చివరికి వాటి అమలులో మీన-మేషాలు లెక్కించేవారికే ఇది తప్పుగా కనిపిస్తుంది.

-రవి శంకర్​ ప్రసాద్, కేంద్ర మంత్రి

బిహార్ వాసులకు ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం ప్రజల ఆరోగ్యం పట్ల భాజపా నిబద్ధతను తెలియజేస్తోందని చెప్పారు రవి శంకర్.

ఇదీ చూడండి: భాజపా 'టీకా' ప్రకటనపై విపక్షాల రగడ

ఇదీ చూడండి: బిహార్​ బరి: నేటి నుంచి మోదీ, రాహుల్ ప్రచారం

ఇదీ చూడండి: బిహార్​ బరి: 'ఎల్​జేపీ' ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

ABOUT THE AUTHOR

...view details