బిహార్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆ రాష్ట్ర భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం.. అధికారులు అయన ఎన్నికను ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సుశీల్‌కు అందజేశారు ఎన్నికల అధికారి.
ఏకగ్రీవంగా రాజ్యసభకు సుశీల్ మోదీ ఎన్నిక - sushil kumar modi news
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ బిహార్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాంవిలాస్ పాసవాన్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగారు మోదీ.
ఏకగ్రీవంగా రాజ్యసభకు సుశీల్ మోదీ
గతంలో ఈ స్థానానికి ఎన్డీఏ కూటమి తరపున లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకులు, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన మృతి చెందడం, అనంతరం ఎన్డీఏ నుంచి ఎల్జేపీ బయటకు రావడం వల్ల ఈ స్థానాన్ని సొంత పార్టీ నేతకే కేటాయించింది భాజపా. గతంలో బిహార్ ఉపముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ మోదీ సేవలందించారు. అయితే తాజా ఎన్నికల తర్వాత ఆయనకు ఆ పదవిని కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే సుశీల్‌కు రాజ్యసభ సీటు దక్కుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.