తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ దుమారం: కేజ్రీకి వ్యతిరేకంగా భాజపా ఆందోళన - జాతీయ పౌర జాబితా

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో నిరసన జ్వాలలు చెలరేగాయి. జాతీయ పౌర జాబితా-ఎన్​ఆర్​సీని దిల్లీలోనూ తీసుకొస్తామన్న మనోజ్​ తివారీపై కేజ్రీవాల్​ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు భాజపా పూర్వాంచల్​ మోర్చా నేతలు, కార్యకర్తలు.

భాజపా పూర్వాంచల్​ మోర్చా

By

Published : Sep 26, 2019, 2:49 PM IST

Updated : Oct 2, 2019, 2:23 AM IST

ఎన్​ఆర్​సీ దుమారం: కేజ్రీకి వ్యతిరేకంగా భాజపా ఆందోళన
అసోం తరహాలో దిల్లీలోనూ జాతీయ పౌర జాబితా-ఎన్​ఆర్​సీ తీసుకొచ్చే అంశంపై అధికార ఆమ్​ఆద్మీ, భాజపా మధ్య వివాదం తీవ్ర రూపు దాల్చింది. ఎన్​ఆర్​సీ తీసుకొస్తామన్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ఎంపీ మనోజ్​ తివారీపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆందోళనకు దిగారు భాజపా పూర్వాంచల్​ మోర్చా నేతలు, కార్యకర్తలు. ఎన్​ఆర్​సీ వస్తే... బిహార్​లో పుట్టిన మనోజ్​ తివారీనే ముందు దిల్లీ వీడి వెళ్లాల్సి వస్తుందని ముఖ్యమంత్రి అనడంపై మండిపడ్డారు. ఫ్లకార్డులు చేతబూని కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీ ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించారు.

నిరసనకారులను అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్​ చేసి స్థానిక పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

Last Updated : Oct 2, 2019, 2:23 AM IST

ABOUT THE AUTHOR

...view details