తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజ్ఞా సింగ్​కు మరోమారు ఈసీ నోటీసులు

భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్​కు మరోమారు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఓ టీవీ షోలో బాబ్రి మసీద్​ ఘటనలో తాను భాగస్వామినయ్యానన్న ప్రజ్ఞా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది ఈసీ. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై  24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రజ్ఞా సింగ్​కు మరోమారు ఈసీ నోటీసులు

By

Published : Apr 21, 2019, 7:29 PM IST

ప్రజ్ఞా సింగ్​కు మరోమారు ఈసీ నోటీసులు

భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి, మాలేగావ్​ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్​కు మరోమారు షోకాజ్​ నోటీసు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఓ టీవీ కార్యక్రమంలో బాబ్రి మసీద్​ ఘటనలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉందన్న ప్రజ్ఞా సింగ్​ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది ఈసీ. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని చాప్టర్​ 4ను ఉల్లంఘించినట్లు తెలిపింది.

భోపాల్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ సుదమ్​ ఖేద్​ శనివారం రాత్రి ప్రజ్ఞా సింగ్​కు నోటీసు జారీ చేశారు. నియమావళి ఉల్లంఘనపై 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

నోటీసుపై స్పందించిన ప్రజ్ఞా సింగ్​ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు​. చట్టప్రకారమే ప్రత్యుత్తరం ఇస్తానని పేర్కొన్నారు.

ముంబయి ఉగ్రదాడిలో మరణించిన పోలీసు అధికారి హేమంత్​ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజ్ఞా సింగ్​కు గత శనివారం మొదటి సారి నోటీసులు ఇచ్చింది ఎన్నికల సంఘం.

ఇదీ చూడండీ:'ఉగ్రవాదాన్ని రూపుమాపే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి'

ABOUT THE AUTHOR

...view details