రాజస్థాన్ రాజకీయాల్లో ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భాజపా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే నకిలీ ఆడియో టేపులను సృష్టించి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ.. కాంగ్రెస్ నేతలు మహేశ్ జోషి, రణ్‌దీప్ సుర్జేవాలా, ఇతర నేతలపై ఫిర్యాదు చేశారు భాజపా అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్.
" భాజపా నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. లోకేశ్ శర్మ నకిలీ ఆడియో టేపులను సృష్టించారు. అది మా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఆడియో టేపుల సృష్టి, తప్పుడు ఆరోపణలపై అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు మహేశ్ జోషి, రణ్‌దీప్ సుర్జేవాలా సహా పలువురిపై ఫిర్యాదు చేశాను."
- లక్ష్మీకాంత్ భరద్వాజ్, భాజపా అధికార ప్రతినిధి