బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా అగ్రనేతలు శనివారం దిల్లీలో సమావేశమయ్యారు. పార్టీ ఇప్పటికే 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బిహార్ అభ్యర్థుల ఖరారుకు భాజపా అగ్రనేతల భేటీ - bjp cec meet
బిహార్ ఎన్నికల పోరులో గెలుపే లక్ష్యంగా భాజపా సమాయత్తమవుతోంది. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు. జేడీయూతో జరిగిన సర్దుబాట్లలో కేటాయించిన మెుత్తం 121 స్థానాల్లో 110 స్థానాల్లో పోటీ చేస్తోంది భాజపా.
బిహార్ అభ్యర్థుల ఖరారుకు భాజపా అగ్రనేతల భేటీ
ఇవీ కేటాయింపులు..
- జేడీయూతో జరిగిన సర్దుబాట్లలో భాగంగా కేటాయించిన మొత్తం 121 స్థానాల్లో భాజపా 110 స్థానాలకు పోటీ చేస్తుంది.
- మిగిలిన 11 సీట్లను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చాలకు ఇచ్చింది.
- జేడీయూ తన వాటా కింద వచ్చిన 122 సీట్లలో 115 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన ఏడు సీట్లను హిందుస్థాన్ అవామ్ మోర్చాకు కేటాయించింది.
ఇదీ చూడండి:40 ఏళ్లలో లాలూ లేకుండా తొలిసారి బిహార్ ప్రచార పర్వం