బంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఖార్దా ఠాణా పరిధిలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.
స్టేషన్లోకి బలవంతంగా చొచ్చుకేళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారని, ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. బులెట్ రాయ్ అనే కార్యకర్త అరెస్టును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఠాణా వద్ద ధర్నా చేపట్టాయి.
"పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కోవడానికి భాజపా కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు."
-నిర్మల్ ఘోష్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే