బంగాల్లోని హూగ్లీ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకంగా మారాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దుర్ఘటనలో ఓ భాజపా కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.
రాష్ట్ర రాజధాని కోల్కతాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖనకుల్లో ఒకే ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలకు భాజపా, టీఎంసీ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య మాటమాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఖండించిన భాజపా..