మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర పర్యటక సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. బంగాల్ ప్రభుత్వం కాఫీ తోట కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పుకోసం ఎదురుచూస్తున్నారన్నారు. వచ్చే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 200పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఉత్తర బంగాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
" ప్రకృతి డార్జిలింగ్ ప్రాంతానికి అన్నీ ఇచ్చింది. కానీ బంగాల్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. 10ఏళ్లుగా టీ గార్డెస్స్లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. స్థానిక కళ, సంప్రదాయాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. డార్జిలింగ్‌లో సంప్రదాయ కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కళ, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి భూమిని కేటాయించాలి."