యావత్ ప్రజానీకం భాజపా పెట్టే వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో బెంగాలీ, బెంగాలీయేతరుల మధ్య చిచ్చుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.
పశ్చిమ్ బంగలో ప్రభుత్వాన్ని కూల్చివేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తే తన కంటే పెద్ద శత్రువు ఎవరూ ఉండరని భాజపాను హెచ్చరించారు మమతా బెనర్జీ. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తలపై జరుగుతున్న హింసతో.. కమలం పార్టీపై ప్రజల్లో ద్వేషం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు మమత. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బ తీయాలని భాజపా చూస్తోందని.. అలాంటి పార్టీ అంటే తనకు ఇష్టం లేదని తెలిపారు మమతా బెనర్జీ. లోక్సభ ఎన్నికల అనంతరం ఆమె తొలిసారి నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వారిని విడిచిపెట్టను: మమత