తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​'నాటకం': అసంతృప్తులతో కాంగ్రెస్​ సంప్రదింపులు - గవర్నర్​

శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కర్ణాటక ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా కాంగ్రెస్​ ప్రయత్నాలు చేపట్టింది. రాజీనామాలపై వెనక్కి తగ్గని ఎమ్మెల్యేలు ముంబయి వెళ్లగా.. కాంగ్రెస్​ నేతలు బెంగళూరులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అసంతృప్త శాసనసభ్యులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ విశ్వప్రయత్నాలు

By

Published : Jul 7, 2019, 6:04 AM IST

Updated : Jul 7, 2019, 8:08 AM IST

గతేడాది ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఆసక్తికరంగా సాగుతున్న కర్ణాటక రాజకీయాలు.. మరో కొత్త మలుపు తిరిగాయి. సంకీర్ణ కూటమి భవిష్యత్తు మరింత సందిగ్ధంలో పడింది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వారం కిందటే ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజీనామాతో.. మొత్తం ఆ

సంఖ్య 14కు చేరింది. ఇందులో ముగ్గురు జేడీఎస్​ శాసనసభ్యులున్నారు.

వీరి రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకోసం కర్ణాటక ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ ప్రయత్నాలు చేపట్టింది. సంక్షోభాన్ని పరిష్కరించేకు బెంగళూరులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు కాంగ్రెస్​ నేతలు.

సీఎల్పీ నేత ఇంట్లో..

కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే. శివకుమార్​ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించినా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం శాసనసభ్యులు.. గవర్నర్​తో సమావేశమై ముంబయికి చేరుకున్నారు.

తాజా పరిణామాల నడుమ కాంగ్రెస్​ నాయకులు చర్యలు ఆరంభించారు. కర్ణాటక కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు కేసీ. వేణుగోపాల్​ ఆధ్వర్యంలో.. సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో చర్చలు జరిపారు. తదుపరి ఏం చేయాలోనని ఆలోచించారు.

అమెరికా నుంచి పయనం..

అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు కర్ణాటక చేరుకోనున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు... ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాతో ఆయనా అర్ధంతరంగా పర్యటన ముగించుకుంటున్నారు.

అనంతరం... కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమకు టచ్​లోనే ఉన్నారని, వారు తిరిగొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత అజయ్​సింగ్​.

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ విశ్వప్రయత్నాలు

'మేం ఊహించని సీనియర్​ నాయకులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పటికీ కొందరు శాసనసభ్యులు మాతో సంప్రదింపుల్లో ఉన్నారు. తర్వాత ఏం చేయాలి.. సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశంపై చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర కాంగ్రెస్​ బాధ్యులు కేసీ వేణుగోపాల్​, హోం మంత్రి దీని గురించే చర్చిస్తున్నాం. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తిరిగి ఎలా రప్పించాలోనని చర్చిస్తున్నాం.'

ఆపరేషన్​ కమల్​, ఆపరేషన్​ లోటస్​ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి జరుగుతుంది. ఇప్పుడు బయటపడింది. రాజీనామాల వెనక మేం లేమనిభాజపా నేతలుచెబుతున్నారు. దీని వెనక ఎవరున్నారో యావత్​ ప్రజానీకానికి తెలుసు.

- అజయ్​ సింగ్​, కర్ణాటక కాంగ్రెస్​ నేత

రాజీనామాలపై స్పీకర్​ మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాను 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భవిష్యత్తు ఏంటనేది ఆ రోజే తేలనుంది. గవర్నర్​ కూడా ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. గవర్నర్​ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని.. ఇప్పటికే ప్రకటించింది భాజపా. ఈ తరుణంలో కన్నడ రాజకీయంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated : Jul 7, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details