ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యుల్ని కొనుగోలు చేసేందుకు భాజపా ప్రయత్నించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బుధవారం దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ఆప్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ అభివృద్ధిని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అడ్డుకుందని విమర్శించారు కేజ్రీవాల్.
"గత మూడు రోజుల్లో మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.10కోట్లు ఇస్తామని భాజపా నేతలు సంప్రదించినట్లు వారు నాతో చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదు. బంగాల్లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఇటీవలే ప్రధాని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టాలనుకోవడం తప్పు."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం