తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఫస్ట్... తర్వాత వైకాపా, తెదేపా - రాజకీయ ప్రకటనలు

మునుపెన్నడూ లేని స్థాయిలో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ప్రచారానికి విరివిగా వినియోగించుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా, వైకాపా, తెదేపా పోటాపోటీగా ప్రకటనలు ఇస్తున్నాయి. గూగుల్​ లెక్కలో కాంగ్రెస్ కాస్త వెనుకబడింది.

గూగుల్​లో రాజకీయ ప్రకటనలు

By

Published : Apr 4, 2019, 12:03 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందుకు మునుపెన్నడూ లేని స్థాయిలో సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి.

రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు 2019 ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు రాజకీయ ప్రకటనలకుగాను సుమారు రూ. 3.76 కోట్లు ఖర్చు చేశాయి. ఈ విషయాన్ని ఇంటర్నెట్​ దిగ్గజం గూగుల్ గురువారం విడుదల చేసిన భారత పారదర్శక నివేదిక స్పష్టం చేస్తోంది.

ప్రథమ స్థానంలో భాజపా

భాజపా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో దూసుకుపోతోంది. గూగుల్​లో ప్రకటనలకు రూ.1.21 కోట్లు (32 శాతం వాటా) ఖర్చు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్​ కేవలం రూ.54,100 (0.14 శాతం వాటా) ఖర్చుతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

రెండో స్థానంలో వైకాపా

జాతీయ పార్టీలతో పోటీపడుతూ ప్రాంతీయ పార్టీలు ప్రసార మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్​లో వైకాపా సామాజిక మధ్యమాలను వాడుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. గూగుల్​లో ప్రకటనల కోసం రూ.1.04 కోట్లు వెచ్చించి రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో వైకాపా అభ్యర్థులను బలపరుస్తూ ఆ పార్టీ అభిమాని పమ్మి సాయిచరణ్​రెడ్డి రూ.26,400 విలువైన ప్రకటనలు ఇప్పించారు.

తెదేపా దూకుడు

ఏపీలో అధికార తెలుగుదేశం వైకాపాతో ఢీ అంటే ఢీ అంటోంది. ఇంటర్నెట్​లో దీటుగా ప్రచారం చేస్తోంది పసుపు దళం. తెదేపా తరపున ప్రామాణ్య స్ట్రేటజీ కన్సల్టింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.85.25 లక్షలు విలువైన ప్రకటనలు ఇచ్చి మూడో స్థానంలో నిలిచింది.

తెదేపాను బలపరుస్తూ మరో సంస్థ డిజిటల్ కన్సల్టింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ గూగుల్​లో రూ.63.43 లక్షల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చింది.

3, 4 స్థానాల్లో ఉన్న సంస్థలు తెదేపాకు మద్దతుగా ప్రకటనలు ఇస్తున్నవే. ఆ రెండు సంస్థల ఖర్చును కలిపి పరిగణనలోకి తీసుకుంటే... అంతర్జాల ప్రచార ఖర్చులో తెదేపాదే ప్రథమ స్థానం.

నిబంధనలు ఉల్లంఘించినందుకు రాజకీయ ప్రకటనలు ఇవ్వకుండా 11 పార్టీలు/సంస్థలను నిషేధించినట్లు ప్రకటించింది గూగుల్.

ABOUT THE AUTHOR

...view details