తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మండ్యలో సుమలతకు భాజపా మద్దతు - nikhil

కర్ణాటకలోని మండ్య లోక్​సభ స్థానం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దివంగత అంబరీష్​ భార్య సుమలత, ముఖ్యమంత్రి హెచ్​డీ. కుమారస్వామి కుమారుడు నిఖిల్​, భాజపాల మధ్య పోటీ ఉంటుందని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు సుమలతకు భాజపా మద్దతు ప్రకటించడం వల్ల పరిణామాలు వేగంగా మారిపోయాయి. వీరినెలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచించే పనిలో పడింది కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి.

మండ్యలో సుమలతకు భాజపా మద్దతు

By

Published : Mar 24, 2019, 8:45 AM IST

సుమలతకు మద్దతు ప్రకటించిన భాజపా
కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే సంఘటనలు జరగుతున్నాయి. కాంగ్రెస్​- జేడీఎస్​ల కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేకించి మండ్య స్థానంలో ప్రతిఘటన తప్పకపోవచ్చు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు భాజపా మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంది. ఇక ఇక్కడ సమరం నిఖిల్​- సుమలతల మధ్యే.

సుమలతకు మద్దతుపై అధిష్టానం ఆమోదం లభించిందని.. భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్​ ప్రకాశ్​ నడ్డా ప్రకటించారు. సుమలతకు మద్దతుతో కాంగ్రెస్​ అసంతృప్తుల్ని తమ పార్టీలో చేర్చుకోవచ్చని భావిస్తోంది భాజపా. మండ్య స్థానాన్ని జేడీఎస్​కు ఇచ్చినందుకు ఇప్పటికీ కొందరు కాంగ్రెస్​ నేతలు పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు.

కన్నడ సినీ పరిశ్రమ నుంచి సుమలతకు ఊహించని మద్దతు లభిస్తోంది. యశ్​, దర్శన్​ వంటి అగ్రకథానాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మండ్యలోని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం. కృష్ణ మద్దతునూ కోరారు సుమలత.

దేవెగౌడ కుటుంబంలో మూడో తరం.. నిఖిల్​ రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే అదరగొట్టాలన్న ఉద్దేశంతో కంచుకోట లాంటి స్థానం మండ్యలో పోటీకి దించింది జేడీఎస్​. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుమలత రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్​ టికెట్​ నిరాకరించగా.. రెబల్​గా మారారు సుమలత. దివంగత రాజకీయ నేత, ప్రముఖ నటుడు అంబరీష్​ భార్యనే సుమలత. వీరిని ఎదుర్కోవాలంటే సంకీర్ణ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details