తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సవరణపై భాజపా దేశవ్యాప్త ప్రచారం! - 'పౌర' సవరణ బిల్లుపై భాజపా దేశవ్యాప్త ప్రచారం..!

పౌరసత్వ చట్ట సవరణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది భాజపా. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సవరణ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ప్రజలందరికీ తెలియజేయాలని నిర్ణయించుకుంది.

BJP to launch campaign about amended Citizenship Act
'పౌర' సవరణ బిల్లుపై భాజపా దేశవ్యాప్త ప్రచారం..!

By

Published : Dec 13, 2019, 1:40 PM IST

Updated : Dec 13, 2019, 4:42 PM IST

'పౌర' సవరణపై భాజపా దేశవ్యాప్త ప్రచారం!

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన క్షణం నుంచి దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే ఈ బిల్లుపై.. ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ చట్ట సవరణ వల్ల కలిగే ప్రయోజనాలను, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇందుకు శనివారం నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.

పౌరసత్వ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా... శరణార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు భాజపా నేతలు తెలిపారు.

'సవరణ లాభాలు చెబుతాం'

పుస్తకాల పంపిణీతో పాటు బహిరంగసభలు ఏర్పాటు చేసి పౌర చట్ట సవరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు బంగాల్​ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్. ఈ సవరణ ద్వారా సుమారు 2 కోట్ల మందికి భారత పౌరసత్వం దక్కనుందని తెలిపారు.​

కొత్త చట్టం ప్రకారం ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం ఎలా పొందాలన్న అంశంపైనా భాజపా ప్రచారం చేయనుంది.

ఇదీ చదవండి:'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'

Last Updated : Dec 13, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details