తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెరవేర్చిన హామీలే ప్రచారాస్త్రాలా..! - హామీ

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం విజయవంతంగా నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించాలని భాజపా నిర్ణయించింది. 2014లో మోదీ ఇచ్చిన హామీల్లో పూర్తయిన వాటితోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై జాబితా తయారు చేస్తోంది కాషాయ పార్టీ.

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం

By

Published : Mar 17, 2019, 9:30 AM IST

పూర్తి చేసిన హామీలే భాజపా ప్రచారాస్త్రాలా..!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ వైఫల్యాలపై విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకుపార్టీ నియమించిన బృందం ప్రభుత్వం నెరవేర్చిన హామీల జాబితా తయారు చేస్తోంది. ఉద్యోగ కల్పన, సామాజిక, అంతర్గత భద్రతలను కీలకాంశాలుగా తీసుకుంది భాజపా.

హామీల్లో లేని అంశాలైన ఉజ్వల, ముద్ర వంటి పథకాలనూ జాబితాలో పొందుపరచనున్నట్లు పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి తెలిపారు.

"దీర్ఘకాలిక అజెండాతో సమస్యలకు మోదీ తక్షణ పరిష్కారం చూపారు. దీనికి ఉదాహరణ వస్తుసేవల పన్ను. సామాజిక భద్రతకు మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. దేశ రక్షణకు మోదీ తీసుకున్న చర్యలకు ఏ ప్రభుత్వమూ సాటిరాదు."
-వినయ్ సహస్ర బుద్ధి, భాజపా ఉపాధ్యక్షుడు

ఇదీ చూడండి:వృద్ధ రైతులకు పింఛను హామీ...!

ABOUT THE AUTHOR

...view details