బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా క్షేత్ర స్ధాయిలో కార్యకర్తల మధ్య పరస్పర ఘర్షణలు తలెత్తుతున్నాయి. పూర్వా మెదీనీపూర్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో తృణమూల్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురు గాయపడ్డారు. తాజాగా దాడులు జరిగిన ప్రదేశం .. ఇటీవల టీఎంసీ నుంచి భాజపాలో చేరిన కీలక నేత సువెేందు అధికారికి సుబేంధు అధికారికి పట్టున్న ప్రాంతం కావడం గమనార్హం.
టీఎంసీ- భాజపా నేతల ఘర్షణ.. పలువురికి గాయాలు - bjp tmc clash in ramnagar
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బంగాల్‌లో రాజకీయ దాడులు పెరిగాయి. తాజాగా అధికార తృణమూల్, భాజపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.

బంగాల్‌లో రాజకీయ దాడులు.. పలువురికి గాయాలు..
బంగాల్‌లో రాజకీయ దాడులు.. పలువురికి గాయాలు..
తృణమూల్ పార్టీ కార్యాలయం మీదుగా భాజపా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ గొడవ తలెత్తింది. ఘర్షణలను పోలీసులు అదుపు చేశారు. దాడికి మీరంటే మీరే కారణం అని తృణమూల్, భాజపా నేతలు ఆరోపణలు గుప్పించుకున్నారు.