కర్ణాటక ఉపఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 15 స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాలని చూస్తోంది భాజపా. ఈ ఎన్నికల్లో గెలిచినవారని మంత్రి పదవుల్లోకి తీసుకుంటామనే వాదనను బలంగా వినిపించి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. ఉపఎన్నికలు జరుగుతున్న 15 స్థానాల్లో 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చింది.
మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మాత్రం.. ఉపఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేల ఓటమి తమ ప్రధాన అజెండాగా ప్రకటించాయి. ఎన్నికల్లో గెలుపొందిన వారిని మంత్రి పదవుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించాడాన్ని తప్పుపట్టాయి.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.
రెబల్ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తామన్న యడియూరప్ప ప్రకటనను తప్పుపడుతూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల విజయ అవకాశాలను పెంచేందుకు ఓటర్లను ప్రేరేపించటం, ప్రభావింతం చేయడానికి ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించింది.
భాజపాలోకి 16 మంది...
ఉప ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు ఈ నెల 13న సుప్రీం కోర్టు అనుమతించింది. ఆ మరుసటి రోజునే 17 మంది రెబల్ ఎమ్మెల్యేల్లో 16 మంది భాజపాలో చేరారు. ఇందులో 13 మందికి ఇప్పటికే టికెట్లు కేటాయించింది అధికార పార్టీ. యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ సాధించటానికి మరో 6 స్థానాలు అవసరం. ప్రస్తుతం 15 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో 15 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
మా వాగ్దానంలో తప్పేమి లేదు...