ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించింది. ఎల్జేపీతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం'
బిహార్ ఎన్డీఏలో జేడీయూ, జీతన్‌రాం మాంఝీకి చెందిన హెచ్ఏఎం(ఎస్), వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలు మాత్రమే ఉన్నాయని భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నాలుగింట మూడొంతుల మెజారిటీతో గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఓట్లు చీల్చేడం మినహా ఎల్జేపీ ఇంకేం చేయలేదని, ఈ విషయంలోనూ పెద్దగా ప్రభావం చూపదని అన్నారు.
ఇదీ చదవండి:బిహార్ బరి: రాజకీయ వేడి పెంచుతోన్న 'ఎల్జేపీ' లేఖ
"మాకు (ఎల్జేపీతో) ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇలాంటి గందరగోళం సృష్టించే రాజకీయాలు మాకు నచ్చవు."
-ప్రకాశ్ జావడేకర్, భాజపా సీనియర్ నేత