తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ప్రగ్యా ఠాకూర్. ఉదమ్సింగ్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపైనే తాను స్పందించానంటూ స్పష్టం చేశారు. వాస్తవాలను అడ్డుకోలేరంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా దిద్దుబాటు చర్యలు - ప్రగ్యాసింగ్ ఠాకూర్
12:30 November 28
మాటమార్చిన ప్రగ్యా ఠాకూర్
12:06 November 28
పార్లమెంట్ చరిత్రలో చీకటిరోజు: రాహుల్ గాంధీ
గాడ్సే దేశభక్తుడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నాథూరాం గాడ్సేను దేశభక్తుడని పొగడటం పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు.
మహాత్ముడిని చంపినందుకే నాథూరాం గాడ్సే న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందని డీఎంకే నేత ఏ. రాజా చేసిన ప్రకటనకు సమాధానంగా పైవిధంగా స్పందించారు ప్రగ్యా.
11:58 November 28
'మహాత్ముడే మార్గదర్శకుడు'
గాడ్సేను దేశభక్తుడన్న ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. కాంగ్రెస్ సభ్యుల వాయిదా తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చారు. భారత్‌కు ఇప్పటికీ మహాత్ముడి మాటలే మార్గదర్శి అని స్పష్టం చేశారు.
11:05 November 28
మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడిగా కీర్తిస్తూ భాజపా ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ప్రగ్యా వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్... లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
ప్రగ్యా మాటలపై దుమారం నేపథ్యంలో భాజపా అప్రమత్తమైంది. ఆమె వ్యాఖ్యలను ఖండించింది. ప్రగ్యా సింగ్‌ను రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం నుంచి తొలగించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. అందుకు అనుగుణంగా తక్షణమే రాజ్‌నాథ్ నిర్ణయం తీసుకున్నారు.
లోక్‌సభలో...
అయినా... ప్రగ్యా అంశాన్ని లోక్‌సభలో విపక్షాలు ప్రస్తావించాయి. ఆమె తీరుపై అభ్యంతరం తెలిపాయి. వెంటనే రాజ్‌నాథ్ స్పందించారు. "గాడ్సే దేశభక్తుడని ఎవరన్నా మా పార్టీ ఖండిస్తుంది. మహాత్మ గాంధీ సిద్ధాంతమే గొప్పది" అని స్పష్టంచేశారు.
రాజ్‌నాథ్ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు... లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.