తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో మళ్లీ భాజపా-సేనదే అధికారం- పీఠం చెరిసగం! - మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారం భాజపా-శివసేనదేనని ఖరారైంది. మొత్తం 161 స్థానాలు నెగ్గి సాధారణ మెజార్టీ సాధించింది అధికార కూటమి. కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి 98 చోట్ల గెలిచి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇతరులు 29 చోట్ల గెలుపొందారు.

'మహా'లో అధికార కూటమిదే గెలుపు..

By

Published : Oct 24, 2019, 6:24 PM IST

Updated : Oct 24, 2019, 10:45 PM IST

మహారాష్ట్రలో అధికార కూటమి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చింది. భాజపా-శివసేన కూటమి 161 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో కాషాయ పార్టీ 105, సేన 56 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ... కాంగ్రెస్​-ఎన్సీపీలు అధికార కూటమికి గట్టి పోటీనే ఇచ్చాయి. 98 చోట్ల నెగ్గినా మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవనుంది.

పార్టీ

గెలిచిన స్థానాలు

భాజపా 105
శివసేన 56

కాంగ్రెస్

44
ఎన్సీపీ 54
ఇతరులు 29

మొత్తం

200

ఇప్పటికే మెజార్టీ సాధించిన భాజపా-శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో సీఎం పదవిపై సందిగ్ధం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ప్రతిపాదన తెచ్చింది శివసేన. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సొంతంగా సాధించని భాజపా అందుకు అంగీకరించినట్లే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో శివసేన నుంచి కూడా ఈ సారి ముఖ్యమంత్రిని చూసే అవకాశముంది.

తగ్గిన మెజారిటీ...

2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సారి భాజపా జోరుకు కాంగ్రెస్​-ఎన్సీపీ కాస్త బ్రేక్​ వేసిందనే చెప్పాలి.

భాజపా సంబరాలు..

గెలుపు ఖరారైన నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్​.. పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. బాణాసంచా పేలుళ్లతో అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖులు జయభేరి మోగించారు. భాజపా సీఎం అభ్యర్థి ఫడణవిస్​, కాంగ్రెస్​ నేతలు అశోక్​ చవాన్​, పృథ్వీరాజ్​ చవాన్​, ఎన్సీపీ నుంచి అజిత్​ పవార్​ ఘన విజయం సాధించారు. శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే సహా పలువురు ముఖ్యులు గెలిచారు.

Last Updated : Oct 24, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details