తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోటీకే కాదు ప్రచారానికీ అగ్రనేతలు దూరం - మనోహర్​ జోషీ

భాజపా ప్రధాన ప్రచాకర్తల జాబితా విడుదల చేసింది. ఇందులో అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి పేర్లు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అడ్వాణీ ఎప్పుడూ పోటీచేసే గాంధీ నగర్​ స్థానాన్ని ఇటీవలే అమిత్​షాకు కేటాయించింది. ఎన్నికలకు దూరంగా ఉండాలని జోషికీ సూచించింది.

మరో భాజపా కురువృద్ధ నేతకు తప్పని భంగపాటు

By

Published : Mar 26, 2019, 1:09 PM IST

Updated : Mar 26, 2019, 1:55 PM IST

పోటీకే కాదు ప్రచారానికీ అగ్రనేతలు దూరం
భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీకి గుజరాత్​ గాంధీనగర్​ టికెట్​ కేటాయించకపోవడంపై దుమారం సద్దుమణగక ముందే మరో విషయం చర్చనీయాంశమైంది.తాజాగా విడుదల చేసిన ప్రధాన ప్రచారకర్తల జాబితాలో అడ్వాణీ, మరో సీనియర్​ నేత మురళీ మనోహర్​ జోషి పేర్లు కనిపించలేదు.

మంగళవారం విడుదల చేసిన 40 మంది ప్రధాన ప్రచారకర్తల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా, కేంద్రమంత్రులు రాజ్​నాథ్ సింగ్​, అరుణ్జైట్లీ సహా పలువురు పార్టీ కీలక నేతలున్నారు.

జాబితాలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ, తనయుడు వరుణ్​ గాంధీల పేర్లు కనపడలేదు. ఈ విషయంపై స్పందించడానికి భాజపా నిరాకరించింది.

జోషికి ఎన్నికల్లోనూ...

మురళీ మనోహర్​ జోషినిసార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండమని సూచించింది భాజపా. ఈ విషయాన్ని జోషి కార్యాలయం ధ్రువీకరించింది.

85 ఏళ్ల జోషి 2014 ఎన్నికల్లో కాన్పూర్​ నుంచి విజయం సాధించారు.

Last Updated : Mar 26, 2019, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details