తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పక్కా లెక్కలతో సం'కుల' సమరానికి సై

2014లో ఎన్డీఏకు ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చిన సీట్లు 73. ఇప్పుడు సొంతంగానే కనీసం 74 స్థానాల్లో గెలవాలన్నది భాజపా లక్ష్యం. ఇదెలా సాధ్యం? ఇందుకోసం కమలదళం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది?

యూపీ ఎన్నికల్లో కమలదళం వ్యూహం

By

Published : Mar 29, 2019, 6:51 PM IST

Updated : Mar 29, 2019, 7:38 PM IST

యూపీలో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్న భాజపా
"మిషన్​ 74 ప్లస్​..!"... ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా నినాదం. ఆ రాష్ట్రంలోని 80 లోక్​సభ నియోజకవర్గాల్లో కనీసం 74 గెలుచుకోవాలన్నది ఆ పార్టీ లక్ష్యం.

2014లో యూపీలో భాజపా గెలిచిన స్థానాలు 71. మిత్రపక్షం అప్నాదళ్​కు మరో 2 వచ్చాయి. అంతటి సంచలన విజయానికి కారణం... 'సోషల్​ ఇంజినీరింగ్​'. ప్రాంతాలవారీగా సామాజిక సమీకరణాలకు సమతూకం వేస్తూ అమిత్​షా అనుసరించిన వ్యూహం గత ఎన్నికల్లో అసాధారణ గెలుపునకు ఉపకరించింది. అంతలా కలిసొచ్చిన సోషల్​ ఇంజినీరింగ్​ మంత్రాన్ని మరోమారు ప్రయోగించింది భాజపా. ఇప్పటివరకు జరిగిన సీట్ల కేటాయింపు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

ఇదీ చూడండి :భారత్​ భేరి: రాజకీయ తెరపై తారాతోరణం

"గతంలో సత్ఫలితాలు ఇచ్చిన సోషల్​ ఇంజినీరింగ్​ వ్యూహాన్ని భాజపా మరోమారు అమలు చేసింది. ఈసారి యాదవ్​యేతర ఓబీసీలు, జాటవ్​యేతర ఎస్సీలు, అగ్రవర్ణాలు ప్రత్యేకించి బ్రాహ్మణులు, క్షత్రియులకు టికెట్ల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇచ్చింది."

--హేమంత్​ తివారి, రాజకీయ విశ్లేషకుడు

ఇప్పటివరకు 61 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది భాజపా. ఇందులో అత్యధిక సీట్లు దక్కింది బ్రాహ్మణులకే.

80 స్థానాల్లో 74 గెలవాలనే వ్యూహంలో భాజపా

"టికెట్ల కేటాయింపులో భాజపా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినట్లు అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే తెలుస్తుంది. సిట్టింగ్​ ఎంపీలను పక్కనబెట్టిన చోట వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే బరిలోకి దింపారు."

--హేమంత్​ తివారి, రాజకీయ విశ్లేషకుడు

అబ్బే... అలాంటిదేం లేదు....

కులం ఆధారంగా టికెట్లు కేటాయించారన్న విశ్లేషణలను భాజపా తోసిపుచ్చింది.

''కుల రాజకీయాల్ని మా పార్టీ ప్రోత్సహించదు, నమ్మదు. విజయావకాశాలు, స్థానిక బలాబలాల ఆధారంగానే టిక్కెట్లు కేటాయించాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే అధిష్ఠానం అభ్యర్థుల్ని ఎంపిక చేసింది.''

- భాజపా సీనియర్​ నేత

స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొని.. చాలా మంది సిట్టింగ్​ ఎంపీలకు నిరాశనే మిగిల్చింది. భాజపా అగ్రనేత మురళీ మనోహర్​ జోషి(కాన్​పుర్​), ప్రియాంక రావత్​(బారాబంకీ), అశోక్​ దోహ్రే(ఇటావా), భరత్​ సింగ్​(బలియా), రాజేష్​ పాండే(కుశీ నగర్​), నేపాల్​ సింగ్​(రాంపుర్​)ను ఎన్నికలకు దూరం పెట్టింది.

''టికెట్లు దక్కని నేతలు ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయరు. మా పార్టీలోని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రధాన ధ్యేయం మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే. మా ప్రయత్నంలో భాగంగా కులతత్వ శక్తులను, అవినీతిని తరిమికొడతాం.''

- భాజపా సీనియర్ నేత

భాజపా ఎన్ని లెక్కలు వేసుకున్నా... ఉత్తర్​ప్రదేశ్​లో ఆ పార్టీకి ఒక్క స్థానం మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్.

ఇవీ చూడండి:

పాలు, సైకిల్​, పొయ్యి- కాదేదీ చందాకు అనర్హం

భారత్​ భేరి: తేజస్విని కాదు తేజస్వి..!

ఆలయం సరే... వాతావరణం సంగతేంటి..?

Last Updated : Mar 29, 2019, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details