బిహార్ ఎన్నికల్లో పోటీచేయనున్న 35 మంది అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసింది భాజపా. తాజాగా విడుదలైన 4వ జాబితాతో కలిపితే మొత్తం 110 మంది పేర్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఎంపికైన 35 మంది.. నవంబర్ 7న జరిగే మూడో దశ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు.
బిహార్ బరి: భాజపా అభ్యర్థుల లెక్కలు తేలాయ్.. - బిహార్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు
బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేసింది భాజపా. ఫలితంగా మొత్తం 110 సీట్లకు పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది.
బిహార్ ఎన్నికలు: అభ్యర్థులను ఖరారు చేసిన భాజపా
ఈ ఎన్నికల్లో భాజపా-జేడీయూ కూటమిగా బరిలోకి దిగనున్నాయి. భాజపా 110 స్థానాల్లో, జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే, ఈ కూటమిలో.. హిందుస్థాన్ అవామ్ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు కూడా భాగస్వాములయ్యాయి. ఈ రెండూ 11 స్థానాల్లో పోటీచేయనున్నాయి.