బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో 27 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది భాజపా. ఇటీవల పార్టీలో చేరిన ప్రముఖ షూటర్ శ్రేయసి సింగ్ జమూయి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. మాజీ ఎంపీ హరి మాంఝీ బోధ్‌గయా నుంచి పోటీ చేయనున్నారు.
బిహార్ బరి : 27మందితో భాజపా అభ్యర్థుల జాబితా - bjp candidate list 2020
బిహార్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలకు గాను 27 మంది అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది. ఈ నెల 28న ప్రారంభంకానున్న ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి.
బీహార్ ఎన్నికలు: 27 మంది అభ్యర్థులను ప్రకటించిన భాజపా
ఈనెల 28న మొదటి దశ పోలింగ్ 71 స్థానాలకు జరగనుంది. మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమిలోని జేడీయూ 122, భాజపా 121 స్థానాల్లో పోటీ చేయనుంది.
ఇదీ చూడండి: బిహార్ బరి: జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు