కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తరచూ విదేశీ పర్యటనలు చేయడంపై భాజపా విమర్శలు గుప్పించింది. రాహుల్ విదేశీ పర్యటనల విషయంలో గోప్యత ఎందుకని, ఆయనేమైనా రహస్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అని ప్రశ్నించింది. ప్రపంచమంతా ధ్యానం (మెడిటేషన్) కోసం భారత్‌కు వస్తుంటే, రాహుల్ మాత్రం విదేశాలకు వెళ్తారని జీవీఎల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడంపై ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇలాంటి ఖరీదైన విదేశీ పర్యటనలకు ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలి. ఎందుకంటే ఒక సాధారణ ఎంపీ ఇంత ధనం సంపాదించలేరు.
గత ఐదేళ్లలో ఆయన 16 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇది ఆయన ఒకప్పటి సొంత లోక్‌సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీని సందర్శించిన సంఖ్య కంటే చాలా ఎక్కువ. రాహుల్‌గాంధీని అమేఠీ ప్రజలు నిరాకరించడానికి ఇదీ ఓ కారణం."- జీవీఎల్ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి
నిబంధనలు పాటించాలి