మరోమారు గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేయటాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీని ఎన్నుకోవటంపై ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సోనియా పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఆ తర్వాత భాజపా జాతీయ సమాచార, సాంకేతిక విభాగం ఇంఛార్జ్ అమిత్ మాలవీయ ట్విట్టర్లో కాంగ్రెస్కు ప్రేమతో అంటూ 7 క్షణాల వీడియో సందేశాన్ని పంచుకున్నారు.