తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరచట్టంపై బాలీవుడ్ తారలతో భాజపా ప్రచారం! - సీఏఏకు మద్దతుకోసం బాలీవుడ్​కు భాజపా

సీఏఏపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీనటులతో సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించాలని భావిస్తోంది.

caa
సీఏఏ

By

Published : Jan 8, 2020, 7:20 AM IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. బాలీవుడ్​ నటీనటులతో ప్రచారం చేయించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం మూడు గంటల పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించింది భాజపా. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా 70 మంది బాలీవుడ్ తారలు ఈ భేటీలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సమావేశానికి హాజరైన వారిలో భూషణ్​ కుమార్​, ప్రసూన్​ జోషీ, అనూ మాలిక్​, కైలాష్​ కేర్​, షాన్​, కునాల్ కోహ్లీ, రణ్​వీర్​ సోరే, రితేశ్​ సిద్వాణీ, రాజ్​కుమార్​ సంతోషీ, సురేస్ వాడేకర్​, నీరజ్​ శ్రీధర్​లు ఉన్నారు.సీఏఏకు ప్రజల మద్దతు పెంచేందుకు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటి ప్రచారం వంటి ప్రణాళికలను ఆవిష్కరించింది భాజపా.

సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు... కొత్త చట్టం ఉపయోగాలను తెలియజేయడం ఈ సదస్సుల ప్రధాన అజెండా కానుంది.

ఇదీ చూడండి:కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

ABOUT THE AUTHOR

...view details