కరోనా వైరస్ దృష్ట్యా భాజపా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నెల పాటు ఎలాంటి నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు.
నెల పాటు భాజపా ర్యాలీలు, నిరసనలు బంద్
కోరనా వైరస్ నేపథ్యంలో నెల రోజుల పాటు ఎలాంటి ర్యాలీలు, నిరసనలు చేపట్టవద్దని కార్యకర్తలను ఆదేశించింది భాజపా. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు నడ్డా చెప్పారు.
నెల రోజుల పాటు భాజపా ర్యాలీలు, నిరసనలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఏప్రిల్ 15 వరకు ప్రదర్శన కార్యక్రమాలకు దూరంగా ఉండి.. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా స్పష్టం చేశారు. ఏదైనా చెప్పాలంటే పార్టీ సీనియర్ నేతలను సంప్రదించాలని భాజపా శ్రేణులకు సూచించారు.
Last Updated : Mar 18, 2020, 11:59 PM IST