తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుశీల్ మోదీ - బిహార్ రాంవిలాస్ పాసవాన్ రాజ్యసభకు ఎన్నిక

బిహార్​ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోదీని భాజపా ఎంపిక చేసింది. అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. రాంవిలాస్ పాసవాన్ మృతితో ​ ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 14న ఉపఎన్నిక జరగనుంది.

Sushil Kumar Modi for Rajya Sabha bypolls
బిహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుశీల్ మోదీ

By

Published : Nov 28, 2020, 5:01 AM IST

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ మృతితో బిహార్​లో​ ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోదీని ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ విపక్ష ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలోకి దించితే డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏకు మెజార్టీ ఉన్న నేపథ్యంలో సుశీల్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది.

ఇదివరకు ఈ స్థానానికి ఎన్​డీఏ కూటమి తరపున లోక్​జనశక్తి పార్టీ వ్యవస్థాపకులు, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన మృతి చెందడం, అనంతరం ఎన్​డీఏ నుంచి ఎల్​జేపీ బయటకు రావడం వల్ల ఈ స్థానాన్ని సొంత పార్టీ నేతకే కేటాయించింది భాజపా.

ఎన్​డీఏ అధికారంలో ఉన్నప్పుడు బిహార్ ఉపముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ మోదీ సేవలందించారు. అయితే తాజా ఎన్నికల తర్వాత ఆయనకు ఈ పదవిని కేటాయించలేదు. రాజకీయ చతురత కలిగిన ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని అప్పుడు ఊహాగానాలు వినిపించాయి.

ఇదీ చదవండి-కేంద్ర మంత్రివర్గంలోకి సుశీల్​ కుమార్​ మోదీ..?

ABOUT THE AUTHOR

...view details