భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా 120రోజుల దేశవ్యాప్త యాత్రను ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా 4రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న ఆయన బూత్, మండలస్థాయి కార్యక్రమాలతోపాటు డజన్‌కుపైగా సభల్లో పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి. త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం సహా.. 2019పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితాలు రానిచోట్ల శ్రేణుల్లో ఉత్సాహం నింపే లక్ష్యంతో జేపీ నడ్డా ఈయాత్ర చేపట్టారు.
ఉత్తరాఖండ్ నుంచి నడ్డా దేశవ్యాప్త పర్యటన షురూ.. - ఉత్తరాఖండ్ నుంచి నాలుగు రోజుల పర్యటను ప్రారంభించిన నడ్డా
భాజపాను అన్ని ప్రాంతాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా 120 రోజుల పాటు చేపట్టిన దేశవ్యాప్త యాత్ర ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు.

నడ్డా దేశవ్యాప్త యాత్ర ప్రారంభం
అన్నిరాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేయటమే లక్ష్యంగా 120 రోజుల దేశవ్యాప్త యాత్ర చేపట్టానన్న జేపీ నడ్డా.. శాంతికుంజ్‌లో గురువుల ఆశీస్సులు తీసుకుని పర్యటనను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.