తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​పై భాజపా ఎంపీ కోర్టు ధిక్కరణ పిటిషన్​ - BJP MP

రాహుల్​ గాంధీపై కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేశారు భాజపా ఎంపీ మీనాక్షి లేఖి. రఫేల్​ అంశంలో రాహుల్..​ కోర్టు నిర్ణయాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు... ఏప్రిల్​ 15న పిటిషన్​పై వాదనలు విననుంది.

సుప్రీంలో రాహుల్​పై ధిక్కరణ పిటిషన్​

By

Published : Apr 12, 2019, 12:39 PM IST

Updated : Apr 12, 2019, 3:16 PM IST

రాహుల్​పై కోర్టుధిక్కరణ పిటిషన్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేశారు. రఫేల్​ కేసులో రాహుల్​గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు మీనాక్షి.

పిటిషన్​ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్​ 15న విచారణకు అంగీకరించింది.

రాహుల్​గాంధీ తన వ్యక్తిగత అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు ఆపాదిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు భాజపా ఎంపీ. లేఖి తరఫున సీనియర్​ న్యాయవాది ముకుల్​ రోహత్గి వాదించనున్నారు.

రఫేల్​ తీర్పులో సుప్రీంకోర్టు 'చౌకీదారే దొంగ' అని వ్యాఖ్యానించినట్లు రాహుల్ మాట్లాడుతున్నారని ముకుల్​ రోహత్గీ ​పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

15 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్​ శూన్యం

Last Updated : Apr 12, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details