రాజ్యసభ సభ్యులు, భాజపా నేత అశోక్ గస్తి కన్నుమూశారు. కరోనాతో సెప్టెంబర్ 2న ఆసుపత్రిలో చేరిన ఆయన.. గురువారం రాత్రి 10.31 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు.
గస్తి తీవ్ర న్యూమోనియా లక్షణాలతో బాధపడినట్లు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ మనీశ్ రాయ్ వెల్లడించారు.
ప్రధాని విచారం..
అశోక్ గస్తి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన కార్యకర్త అని, కర్ణాటకలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పేదలు, బలహీన వర్గాల సాధికారత కోసం పాటుపడ్డారని తెలిపారు. గస్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మోదీ.