తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2014లో పదకొండు... 2019లో ఆ ఒక్కరే! - భాజపా

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే మేనిఫెస్టో ముఖచిత్రంపై మాత్రం ఆసక్తికర చర్చ మొదలైంది. 2014 భాజపా ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై 11 మంది నేతలు కనిపించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం ఒకటే దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది.

మేనిఫెస్టో

By

Published : Apr 9, 2019, 8:31 AM IST

Updated : Apr 9, 2019, 11:58 AM IST

2014లో పదకొండు... 2019లో ఆ ఒక్కరే!

ప్రజాకర్షక పథకాలు, ప్రగతి నివేదన సహా పలు కీలక హామీలతో 45 పేజీల ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం ఒక్కటే కనబడటం మాత్రం సర్వత్రా చర్చకు తెర తీసింది.
2014 భాజపా మేనిఫెస్టో ముఖచిత్రంపై 11 మంది నేతల చిత్రాలు ముద్రించారు.

రెండింటి మధ్య తేడా

2014 ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ చిత్రం ఉంది. ప్రస్తుత ఎన్నికల ప్రణాళికలో ఆయన చిత్రం చివరి పేజీకి మారింది.

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తలయిన శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ, దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ వంటి నేతల చిత్రాలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 2వ పేజీలో ఉండేవి. ప్రస్తుతం వీరి చిత్రాలు చివరికి చేరాయి. ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వని పార్టీ అగ్రనేతలు ఎల్​.కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషీల చిత్రాలు ముఖచిత్రంపై కనుమరుగయ్యాయి.

ప్రస్తుత కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్​ జైట్లీ వంటి నాయకుల చిత్రాలు ముఖచిత్రంలో కరవయ్యాయి. 2014లో వీరి చిత్రాలు మోదీ సరసన మెరిశాయి.

విమర్శలు

ఐదేళ్లలో భాజపాలో జరిగిన నాయకత్వ మార్పులకు మేనిఫెస్టో ముఖచిత్రమే సమాధానమని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అప్పటి మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలు రామమందిర నిర్మాణం, ఆర్టికల్​ 370 రద్దు వంటివి నేటి మేనిఫెస్టోలోనూ ఉన్నాయి. అయితే ముఖచిత్రాలు మారటంపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఇవీ చూడండి:

Last Updated : Apr 9, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details