తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు - భాజపా మైనారిటీ మోర్చ అధ్యక్షుడు అబ్దుల్​ రషీద్​ అన్సారీ

పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముస్లింలలో నెలకొన్న పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు 'జాతీయ స్థాయి సదస్సు' పేరిట జనవరిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

BJP likely to organise meet in Jan to address concerns of Muslims on citizenship issues
పౌర ఎఫెక్ట్​: ముస్లీంలకు భరసో ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు

By

Published : Dec 27, 2019, 9:20 PM IST

Updated : Dec 27, 2019, 11:47 PM IST

ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు

కేంద్రం తీసుకొచ్చిన పౌరచట్టం ముస్లింలకు అన్యాయం చేస్తుందని విపక్షాలు విమర్శిస్తోన్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ చట్టంపై ముస్లింలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు 'జాతీయ స్థాయి సదస్సు' పేరిట జనవరిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది.

ఈ సదస్సు నిర్వహణ గురించి చర్చించేందుకు భాజపా నేత, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ నేతృత్వంలో దిల్లీలో పార్టీ ముస్లిం నేతలు భేటీ అయ్యారు.

"పౌరచట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తోన్న తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకే మేము 'జాతీయ స్థాయి సదస్సు'ను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జనవరి మొదటి నెలలో ప్రారంభమవుతుంది. పౌర చట్టంపై ముస్లింలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, దీనిపై విపక్షాలు ఏ విధంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయో వివరించబోతున్నాం."
-భాజపా నేతలు

ఈ కార్యక్రమానికి మైనారిటీల జాతీయ కమిషన్ చైర్మన్ గయోరుల్ హసన్ రిజ్వి, భాజపా మైనారిటీ మోర్చ అధ్యక్షుడు అబ్దుల్​ రషీద్​ అన్సారీ, భాజపాకు చెందిన కీలకమైన ముస్లిం నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: మహారాష్ట్ర: రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Dec 27, 2019, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details