సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై భాజపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి సుష్మా స్వరాజ్ చేసిన సేవలను కొనియాడారు.67 ఏళ్ల సుష్మా స్వరాజ్మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
జాతీయ రాజకీయాల్లో సుష్మా చెరగని ముద్ర వేశారని కాషాయ దళ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.
"సుష్మా స్వరాజ్ మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. సుష్మా ఒక ఆదర్శవంతమైన కార్యకర్త. జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు."
--- అమిత్ షా, భాజపా అధ్యక్షుడు.
"ప్రతిపక్ష నేతగానైనా, విదేశాంగమంత్రిగానైనా... ఒక ఆదర్శమైన వ్యక్తిత్వానికి ఉదాహరణ సుష్మా స్వరాజ్. అమె ఒక శక్తివంతమైన వ్యక్తి. సుష్మా మరణం భాజపాకు తీరని లోటు."
--- జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు.