తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ'పై సొంత పార్టీ నేత నుంచే భాజపాకు వ్యతిరేకత - 'సీఏఏ'పై భాజపా నేత నిరసన

పౌరసత్వ చట్టంపై బంగాల్​ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్​ బోస్​  అభ్యంతరం వ్యక్తం చేశారు.  చట్టానికి మద్దతుగా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా కోల్​కతాలో భారీ ర్యాలీ నిరవ్వహించిన కొద్ది గంటల్లోనే బోస్​ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

bjp caa
'సీఏఏ'పై భాజపా నేత నిరసన

By

Published : Dec 24, 2019, 4:39 PM IST

పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ తొలిసారి భాజపా నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ మనవడు, బంగాల్‌ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్ చట్టం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా అభిప్రాయాన్ని తెలిపారు.

ఈ దేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించొచ్చని బోస్​ వ్యాఖ్యానించారు. బిల్లుకు మద్దతుగా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

"ఒకవేళ సీఏఏ ఏ మతానికి సంబంధించింది కాకపోతే హిందూ, సిక్కు, బౌద్ద, క్రైస్తవ, పార్శీలు, జైనులు అని ఎందుకు పేర్కొన్నారు. ముస్లింలను ఎందుకు చేర్చలేదు? మనం పారదర్శకంగా ఉందాం..!. భారత్‌ను ఇతర దేశాలతో పోల్చొద్దు. అన్ని వర్గాలు, మతాలను ఈ దేశం స్వాగతిస్తుంది. ఒకవేళ మాతృదేశంలో హింసించకపోతే ముస్లింలు ఇక్కడకు వచ్చేవారే కాదు. కనుక వారిని కలుపుకోవడంలో ఎలాంటి ముప్పు లేదు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లోని బలోచ్‌ ప్రజలు, పాకిస్థాన్‌లోని అహ్మదీయుల పరిస్థితి ఏంటి?"

-చంద్రకుమార్​ బోస్​, బంగాల్​ భాజపా ఉపాధ్యక్షుడు

సీఏఏపై అవగాహన

సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండడం వల్ల భాజపా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా ఇతర ప్రముఖులతో కలిసి సోమవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. చట్టంపై అవగాహన కల్పించే వీడియోలనూ పార్టీ సోషల్‌ మీడియా ఖాతాలో ఉంచారు.

ఇదీ చూడండి : సీడీఎస్​, ఎన్​పీఆర్​కు కేంద్ర కేబినెట్​ పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details