తమిళనాడులో భాజపా నేత కుష్బూ సుందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, మనుస్మృతిపై వీసీకే నేత తిరుమలవలన్ చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టేందుకు చిదంబరం వెళుతుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయడంపై కుష్బూ ట్వీట్ చేశారు. మహిళల గౌరవం కోసం తుది శ్వాస వరకు పోరాడుతామని తెలిపారు.
"నన్ను అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. మహిళల గౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడతాము. మహిళల భద్రతపై ప్రధాని మోదీ అనేక మార్లు మాట్లాడారు. వారి అడుగుజాడల్లోనే ముందుకు సాగుతాం. మహిళలపై దాడి చేసే వారి ముందు మేము తల వంచం."