తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: భాజపా నేత వివాదాస్పద ట్వీట్​.. ఈసీ నోటీసులు

దిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రోజు దిల్లీ వీధుల్లో భారత్​, పాకిస్థాన్​ పోటీ పడతాయని భాజపా నేత కపిల్​ మిశ్రా ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్​ రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్​, ఆమ్​ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో సదరు ట్వీట్​పై వివరణ ఇవ్వాలని మిశ్రాకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

By

Published : Jan 24, 2020, 11:04 AM IST

Updated : Feb 18, 2020, 5:20 AM IST

BJP leader Kapil Mishra
భాజపా నేత కపిల్​ మిశ్రా వివాదాస్పద ట్వీట్

దిల్లీ శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 8న ది‌ల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజున వీధుల్లో భారత్‌, పాకిస్థాన్‌ పోటీ పడతాయని మిశ్రా ట్వీట్‌ చేశారు.

భాజపా నేత కపిల్​ మిశ్రా వివాదాస్పద ట్వీట్

నోటీసులు..

కపిల్ మిశ్రా ట్వీట్​పై కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. మరోవైపు ట్వీట్​పై వివరణ ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారి మిశ్రాకు.. నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సంఘం కూడా.. ట్వీట్​కు సంబంధించి దిల్లీ ఎన్నికల ప్రధానాధికారిని నివేదిక కోరింది. 24 గంటల్లో సమర్పించాలని ఆదేశించింది. అయితే తన వ్యాఖ్యలను మిశ్రా సమర్థించుకున్నారు. నోటీసులకు వివరణ ఇస్తానని తెలిపారు.

కపిల్‌ మిశ్రా గతేడాది ఆగస్టులో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆప్‌ మహిళా విభాగం చీఫ్‌ రిచాపాండేతో కలిసి ఆయన కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: 'కామ్​ కీ చాయ్​'తో ఆప్​ నయా ప్రచారం

Last Updated : Feb 18, 2020, 5:20 AM IST

ABOUT THE AUTHOR

...view details