తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడ్డా '100రోజుల' పర్యటన- అసోంతో షురూ - జేపీ నడ్డా వార్తలు

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా '100రోజుల పర్యటన' ఈ నెల 26న మొదలుకానుంది. అసోం నుంచి ఈ పర్యటన ప్రారంభంకానుంది. ఆ తర్వాత మిజోరం, నాగాలాండ్​లలో పర్యటించనున్నారు నడ్డా.

BJP Leader JP Nadda to kick-start 100-day nationwide tour with Assam visit
నడ్డా 100రోజుల పర్యటన- అసోంలో ఈ నెల 26న షురూ!

By

Published : Nov 22, 2020, 5:34 AM IST

దేశవ్యాప్తంగా భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేపట్టనున్న 100రోజుల పర్యటన ఈ నెల 26న ప్రారంభంకానుంది. ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి ఈ పర్యటనను మొదలుపెట్టనున్నారు నడ్డా. పార్టీకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించేందుకు ఆ రాష్ట్ర భాజపా నాయకులతో వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నారు.

రెండు రోజుల అసోం పర్యటన అనంతరం.. నవంబర్​ 28న మిజోరంకు వెళ్లనున్నారు నడ్డా. ఆ తర్వాత మేఘాలయ, నాగాలాండ్​ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేసేందుకు నడ్డా పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

బంగాల్​లో వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల అనంతరం.. అసోం, కేరళ, పుదుచ్ఛేరి, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా ఈ కార్యక్రమాలు చేపట్టింది. అయితే కొవిడ్​ నేపథ్యంలో ఏ సమావేశంలోనైనా 200 మందికి మించి ప్రజలు ఉండకూడదని పార్టీ వర్గాలు సూచించాయి.

2024 లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందడటం, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన రాష్ట్రాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో నడ్డా తన పర్యటనను సాగించనున్నారు.

ఇదీ చదవండి:'ఎన్నికల్లో భాజపా- అన్నాడీఎంకే కూటమిదే విజయం'

ABOUT THE AUTHOR

...view details