తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం లైవ్​: ముంబయి నుంచి వెనుదిరిగిన శివకుమార్​ - కుమారస్వామి

కర్ణాటకీయం: రసవత్తరంగా రాజకీయాలు

By

Published : Jul 10, 2019, 9:03 AM IST

Updated : Jul 10, 2019, 7:13 PM IST

19:10 July 10

కలవకుండానే...

కాంగ్రెస్​ నేత శివకుమార్​ ముంబయి నుంచి కర్ణాటకకు పయనమయ్యారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవకుండానే నిష్క్రమించారు.

18:19 July 10

అసమ్మతి ఎమ్మెల్యేతో సిద్ధు భేటీ

కాసేపటి క్రితం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సుధాకర్​ను బుజ్జగించేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. విధాన సౌధలో మంత్రి కేజీ జార్జ్ కార్యాలయంలో సుధాకర్​తో భేటీ అయ్యారు. రాజీనామా ఉపసంహరణకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంతకుముందు సుధాకర్​ను లాక్కెళ్లేందుకు కాంగ్రెస్​ నేతలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణగగా... సుధాకర్​తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.

18:00 July 10

విధాన సభలో హైడ్రామా

సుధాకర్​ రాజీనామా సమర్పణ సందర్భంగా కర్ణాటక విధాన సభలో ఉద్రిక్తతలు తలెత్తాయి. రాజీనామా లేఖ సమర్పించిన బయటకు వచ్చిన సుధాకర్​ను కాంగ్రెస్​ సభ్యులు... మంత్రి కేజే జార్జ్​ వద్దకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇందుకు సుధాకర్​ ప్రతిఘటించారు. ఫలితంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్​ అలోక్ కుమార్ రంగంలోకి దిగారు. విధాన సభ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

17:54 July 10

శాసనసభ వద్ద ఘర్షణ!

కర్ణాటక విధాన సౌధలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

17:27 July 10

నాగరాజ్​, సుధాకర్​ రాజీనామా...

ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు స్పీకర్​ ప్రకటించారు. నాగరాజ్​, సుధాకర్​ రాజీనామాలు సమర్పించారని వెల్లడించారు. మరో ఎమ్మెల్యే సైతం రాజీనామా చేసే అవకాశముందని సమాచారం.

16:42 July 10

మరో మగ్గురు రాజీనామా...

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. తాజాగా మరో మగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు సమాచారం. నాగరాజ్​, సుధాకర్​ స్పీకర్​కు తమ రాజీనామా సమర్పించారు. ఇప్పటికే 14 మంది రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో పడింది.

16:11 July 10

స్పీకర్​ వద్దకు భాజపా నేతలు...

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలోని భాజపా బృందం స్పీకర్​ను కలవడానికి విధాన సౌధకు వెళ్లారు.

14:47 July 10

పోలీసుల అదుపులో ఆజాద్

రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక సంక్షోభాన్ని నిరసిస్తూ రాజ్​భవన్​ వద్ద నిరసన చేపట్టడమే ఇందుకు కారణం.

14:35 July 10

పోలీసుల అదుపులో డీకే

రెబల్​ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్​ బయట బైఠాయించిన కాంగ్రెస్​ నేత డీకే శివ కుమార్​ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

14:23 July 10

స్పీకర్​కు మరోమారు రాజీనామా లేఖలు

ముంబయిలోని హోటల్​లో ఉన్న 8 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు... బెంగళూరులోని స్పీకర్​కు స్పీడ్​పోస్ట్ ద్వారా రాజీనామా లేఖలు పంపారు.

కొద్దిరోజుల క్రితం 13 మంది కాంగ్రెస్​, జేడీఎస్​ ఎమ్మెల్యేలు బెంగళూరులో విధాన సౌధకు వెళ్లి స్వయంగా రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే... వాటిలో 8 మంది నిబంధనల ప్రకారం లేవని స్పీకర్​ రమేశ్ స్పష్టంచేశారు. వారంతా తనను ఈనెల 12న లేదా 15న కలవాలని సూచించారు.

ఇప్పట్లో ముంబయి వీడి వచ్చేందుకు సుముఖంగా లేని ఎమ్మెల్యేలు... మరోమారు తమ రాజీనామా లేఖలను స్పీడ్​ పోస్ట్​ ద్వారా బెంగళూరు పంపారు.

14:11 July 10

రాజ్యసభలో ఆగని దుమారం

కర్ణాటక సంక్షోభంపై రాజ్యసభలో మరోమారు నిరసన దిగారు కాంగ్రెస్​ సభ్యులు. ఉదయం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైంది. వెంటనే... కాంగ్రెస్​ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ మరోమారు వాయిదా పడింది.

13:31 July 10

'మహారాష్ట్రలో పోలీసు రాజ్యం...'

కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ లోక్​సభను తాకింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కాంగ్రెస్​ లోక్​సభా పక్ష నేత అధిర్​ రంజన్​ దిగువ సభలో ప్రస్తావించారు. మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ నేత శివకుమార్​ కలవకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు.

13:07 July 10

భాజపా దూకుడు...

కర్ణాటకలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు భాజపా నేతలు ఈరోజు ఆ రాష్ట్ర గవర్నర్​ విజుభాయి వాలాను కలవనున్నారు. స్పీకర్​తో మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

జులై 12 నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని... కానీ సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆరోపించింది భాజపా.

12:41 July 10

3గంటలకు స్పీకర్​తో భాజపా నేతల భేటీ

రాజ్యసభను కర్ణాటక రాజకీయ సంక్షోభం కుదిపేస్తోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. అనంతరం తిరిగి 12 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్​ సభ్యులు భాజపా వ్యతిరేక నినాదాలు చేశారు. దీని వల్ల సభను 2 గంటల వరకు వాయిదా వేయాలని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు నిర్ణయించారు.

12:12 July 10

రాజ్యసభలో వాయిదాల పర్వం

సంక్షోభంలో చిక్కుకున్న సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ బెంగళూరులోని విధాన సౌధ వద్ద యడ్యూరప్ప నేతృత్వంలో భాజపా నేతలు నిరసనకు దిగారు. 

11:38 July 10

రాజ్యసభలో మరోమారు దుమారం

కూటమి రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబయి వెళ్లారు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్​ డీకే శివకుమార్. అయితే... ఆయన్ను హోటల్​లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యేలు ఉన్న హోటల్​లోనే శివకుమార్​ గది బుక్​ చేసుకున్నారు. అయితే... పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న కాసేపటికే బుకింగ్​ను రద్దు చేస్తున్నట్లు హోటల్ యాజమాన్యం ప్రకటించింది. 

రూమ్ బుకింగ్​ రద్దుపై శివకుమార్​ స్పందించారు. తన మిత్రులను(రెబల్​ ఎమ్మెల్యేలను) కలవకుండా తాను ముంబయి వీడి వెళ్లనని చెప్పారు.

11:24 July 10

యడ్యూరప్ప నేతృత్వంలో నిరసన

కాంగ్రెస్​-జేడీఎస్​ అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను ఆమోదించడంలో స్పీకర్ జాప్యం చేస్తూ, ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టే అవకాశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
 

10:48 July 10

ముంబయి హోటల్​ వద్ద హైడ్రామా

కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదురుతున్న సమయంలో అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది భాజపా. కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తున్నారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. నేడు అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. 

రాజీనామాల విషయంలో స్పీకర్​ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు యడ్డీ. 

10:39 July 10

సుప్రీంకోర్టుకు 'కర్ణాటకీయం'

ముంబయి హోటల్లో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు వెళ్లిన డీకే శివకుమార్​ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణహాని ఉందన్న తిరుగుబాటు శాసనసభ్యుల ఫిర్యాదు మేరకు భద్రత కట్టుదిట్టం చేశారు. 

అయితే.. రాజకీయాల్లోకి కలిసే వచ్చామని.. తన స్నేహితులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించారు కాంగ్రెస్​ మంత్రి.

09:47 July 10

అసెంబ్లీ ఎదుట భాజపా ధర్నా..

ముంబయి హోటల్లో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు వెళ్లిన డీకే శివకుమార్​ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణహాని ఉందన్న తిరుగుబాటు శాసనసభ్యుల ఫిర్యాదు మేరకు భద్రత కట్టుదిట్టం చేశారు. 

అయితే.. రాజకీయాల్లోకి కలిసే వచ్చామని.. తన స్నేహితులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించారు కాంగ్రెస్​ మంత్రి.

09:46 July 10

డీకేను అడ్డుకున్న పోలీసులు

ముంబయి హోటల్లో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు వెళ్లిన డీకే శివకుమార్​ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణహాని ఉందన్న తిరుగుబాటు శాసనసభ్యుల ఫిర్యాదు మేరకు భద్రత కట్టుదిట్టం చేశారు. 

అయితే.. రాజకీయాల్లోకి కలిసే వచ్చామని.. తన స్నేహితులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించారు కాంగ్రెస్​ మంత్రి.

09:02 July 10

ముంబయికి డీకే.. కర్​'నాటకం'లో కొత్త మలుపులు​

కర్ణాటక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాజీనామాలు సమర్పించిన 14 మంది తిరుగుబాటు శాసనసభ్యుల్లో 9 మంది రాజీనామాలు నిబంధనల మేరకు లేవని స్పీకర్​ ప్రకటించారు. మిగతా వారివి పరిశీలిస్తానని తెలిపారు సభాపతి రమేశ్​ కుమార్. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఈ సంక్షోభం మరికొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. భాజపా.. అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించి, బెదిరించి.. దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాయి కాంగ్రెస్​-జేడీఎస్​లు.
 

08:47 July 10

కర్ణాటక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాజీనామాలు సమర్పించిన 14 మంది తిరుగుబాటు శాసనసభ్యుల్లో 9 మంది రాజీనామాలు నిబంధనల మేరకు లేవని స్పీకర్​ ప్రకటించారు. మిగతా వారివి పరిశీలిస్తానని తెలిపారు సభాపతి రమేశ్​ కుమార్. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఈ సంక్షోభం మరికొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. భాజపా.. అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించి, బెదిరించి.. దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాయి కాంగ్రెస్​-జేడీఎస్​లు.
 

Last Updated : Jul 10, 2019, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details