తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోలింగ్​ కేంద్రాలకు రానివారి ఓట్లు వేసేయండి' - ఓట్లు

ఉత్తరప్రదేశ్​ భాజపా నేత సంఘమిత్ర మౌర్య ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారు. పోలింగ్​ కేంద్రాలకు రాలేని వారి ఓట్లను మీరే వేసేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

'పోలింగ్​ కేంద్రాలకు రానివారి ఓట్లు వేసేయండి'

By

Published : Apr 21, 2019, 11:52 AM IST

ఉత్తరప్రదేశ్​లో మరో భాజపా నేత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారు. బదాయూ​ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన సంఘమిత్ర మౌర్య... పోలింగ్​ కేంద్రాలకు రాని వారి ఓట్లు వేసేయాలంటూ కార్యకర్తలకు​ పిలుపునిచ్చి వివాదంలో చిక్కుకున్నారు.

ఒక్క ఓటునూ వదలండి

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘమిత్ర మౌర్య వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిస్తూనే... కేంద్రాలకు రాలేని వారి ఓట్లను రహస్యంగా మీరే వేసేయండంటూ సూచించారు.

'పోలింగ్​ కేంద్రాలకు రానివారి ఓట్లు వేసేయండి'

"ఒక్క ఓటునూ వదలకండి. ఎవరైనా పోలింగ్​ కేంద్రాలకు రాలేకపోతే... అవసరమైతే వారి ఓట్లు మీరే వేసేయండి. ఇది దేశంలో ప్రతి చోట జరుగుతుంది."
--- సంఘమిత్ర మౌర్య, భాజపా నేత.

ఇప్పటికే పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు సంఘమిత్ర మౌర్య. బదాయూ ప్రజల జోలికొస్తే... పెద్ద గుండాలా మారుతానని మౌర్య చేసిన వ్యాఖ్యలపై ఇటీవల తీవ్ర దుమారం చెలరేగింది.

2014లో మైన్​పురిలో బహుజన్​ సమాజ్​ పార్టీ అగ్రనేత ములాయంపై పోటీ చేసి ఓడిపోయారు మౌర్య. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరఫున బదాయూ​ నియోజకవర్గం బరిలో నిలిచారు.

ఇదీ చూడండి: లారెన్స్​ దర్శకత్వంలో అక్షయ్​కుమార్..

ABOUT THE AUTHOR

...view details