తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బిహార్​ ఎన్నికల్లో జేడీయూ, ఎల్​జేపీతో కలిసే బరిలోకి' - జేపీ నడ్డా

బిహార్​ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్​జేపీతో కలిసే పోటీ చేస్తామని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్​ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పారు. భాజపా బిహార్​ రాష్ట్ర కార్యసమితి నిర్వహించిన వర్చువల్​ ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు నడ్డా.

BJP, JD(U), LJP to fight Bihar polls together: Nadda
'బిహార్​ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం'

By

Published : Aug 23, 2020, 1:56 PM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు జేడీయూ, ఎల్​జేపీలతో కలిసే భాజపా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కచ్చితంగా విజయం సాధిస్తామని, సీఎం నితీశ్​ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేశారు.

భాజపా బిహార్​ రాష్ట్ర కార్యసమితి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు నడ్డా. నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్​జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తాము ఉమ్మడిగానే బరిలోకి దిగుతామని వివరించారు. కరోనా కట్టడిలో నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు.

"ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపా, జేడీయూ, ఎల్​జేపీ కలిసే బరిలోకి దిగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల 50 వేల పడకలు, 2 వేల కొవిడ్​ చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 10 లక్షల పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకున్నాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80కోట్ల మంది పేదలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నాం."

-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు.

బిహార్​లో ప్రతిపక్షానికి సిద్ధాంతాలు గానీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గానీ లేదని విమర్శించారు నడ్డా. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారన్నారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు-నవంబరులో జరగాల్సి ఉంది. నవంబరు 29తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు.

ఇదీ చూడండి: 'వారి మన్ కీ బాత్ వినండి-పరీక్షలు వాయిదా వేయండి'

ABOUT THE AUTHOR

...view details