తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహిళలపై నేరాల' కేసులున్న చట్టసభ్యుల్లో భాజపా టాప్​

భాజపాకు చెందిన 21మంది చట్టసభ్యులు.. మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​ నివేదిక తెలిపింది. 16 మందితో కాంగ్రెస్​, ఏడుగురితో వైకాపా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు వెల్లడించింది.

BJP has maximum lawmakers facing cases of crime against women, Congress 2nd: ADR
'మహిళలపై నేరాల' కేసులున్న చట్టసభ్యుల్లో భాజపా టాప్​

By

Published : Dec 10, 2019, 5:38 PM IST

మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కొంటున్న చట్టసభ్యుల వివరాలతో అసోసియేషన్​​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​​(ఏడీఆర్​) నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. భాజపా నుంచి అత్యధికంగా 21మంది చట్టసభ్యులపై కేసులున్నాయి. కాంగ్రెస్​ 16, వైఎస్​ఆర్​సీపీ 7తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

4 వేల 896 మంది ప్రస్తుత చట్టసభ్యుల్లో(ఎంపీలు-759, ఎమ్మెల్యేలు 4063) 4 వేల 822 మంది ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక తయారు చేసింది ఏడీఆర్​. 2009లో ఇద్దరు లోక్​సభ ఎంపీలపై కేసులుంటే... 2019కి ఆ సంఖ్య 19కి చేరిందని తెలిపింది.

"తమపై అత్యాచార కేసులున్నాయని ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. గుర్తింపు ఉన్న పార్టీలు.. నేర చరిత్ర ఉన్న 41మంది అభ్యర్థులకు గత ఐదేళ్లల్లో టికెట్లిచ్చాయి. "
- అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​​

నివేదికలోని మరిన్ని అంశాలు...

  • ఐదేళ్లలో మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులను ఎదుర్కొంటున్న 66మందిని భాజపా ఎన్నికల బరిలో దింపింది. కాంగ్రెస్​-46, బహుజన్​ సమాజ్​ పార్టీ​-40 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 572 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు.
  • ఈ అభ్యర్థులెవరినీ ఇంకా దోషులుగా నిర్ధరించలేదు.
  • అదే కాలంలో కేసులున్న లోక్​సభ అభ్యర్థుల సంఖ్య 38 నుంచి 126కు(231శాతం) పెరిగింది.
  • అత్యధికంగా బంగాల్​లో 16మంది(ఎంపీలు/ఎమ్మెల్యేలు)పై కేసులున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా(12), మహారాష్ట్ర ఉన్నాయి(12).

ఇదీ చూడండి:- మహిళపై నేరాల్లో అత్యాచారాలదే అగ్రస్థానం

For All Latest Updates

TAGGED:

adr report

ABOUT THE AUTHOR

...view details