తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా,జీడీపీ, చైనాపై భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే' - Rahul Gandhi fires on BJP

కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా వైరస్​, దేశ జీడీపీ సహా చైనా దురాక్రమణల సమాచారాన్ని అధికార భాజపా వక్రీకరిస్తోందని ఆరోపించారు. భాజపా అబద్ధాలను సంస్థాగతం చేసిందని విమర్శించారు.

Rahul Gandhi
'కరోనా,జీడీపీ, చైనా అంశాలపై భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే'

By

Published : Jul 19, 2020, 1:47 PM IST

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనా​ కేసులు, మరణాలు, దేశ జీడీపీ, చైనాతో ఇటీవల నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై సమాచారన్ని కప్పిపుచ్చుతోందంటూ ట్వీట్​ చేశారు.

" భాజపా అబద్ధాలను సంస్థాగతం చేసింది. మరణాలను తప్పుగా నివేదించటం ద్వారా కరోనా డేటాను.. కొత్త గణన పద్ధతిని ఉపయోగించటం ద్వారా జీడీపీని.. మీడియాను భయపెట్టడం ద్వారా చైనా దురాక్రమణను కప్పిపుచ్చుతోంది. ఈ భ్రమ త్వరలోనే తొలిగిపోతుంది. దానికి భారత్​ మూల్యం చెల్లించక తప్పదు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత

అంతర్జాతీయ మీడియా సంస్థలో వచ్చిన ఓ కథనాన్ని తన ట్వీట్​కు జోడించారు రాహుల్​.

కొద్ది రోజులుగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు రాహుల్​. శుక్రవారం చిన్న వీడియో ద్వారా భారత్​-చైనా ప్రతిష్టంభన అంశంలో ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. 2014లో అధికారం చేపట్టిన నుంచి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేశాన్ని బలహీనపరిచాయని పేర్కొన్నారు. గల్వాన్​ ఘటనపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సహా పలువురు పార్టీ నేతలు సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. అసలు ఏ ప్రాంతంలో దాడి జరిగిందో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!​

ABOUT THE AUTHOR

...view details